Thursday, June 24, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-25



శ్లోకం:  సువ‌ర్ణ‌ధారా స్తోత్రం య‌త్‌

శంక‌రాచార్య నిర్మితం

త్రి సంధ్యం యః ప‌ఠేన్నిత్యం

స‌కుబేర స‌మోభ‌వేత్‌


ప‌ద్యం: క‌న‌క ధారాస్త‌వ‌ము దీని క‌రుణ‌తోడ‌

శంక‌ర భ‌గ‌వ‌త్పాదులు సంత‌రించి

నారు, నిత్య‌ము మూడు సంధ్య‌ల‌ను చ‌దువు

భ‌క్తులు కుబేరు సామ్య‌ము బ‌డ‌య‌గ‌ల‌రు.


అర్థం: మహ‌ర్షి శంక‌ర‌భ‌గ‌వ‌త్పాదులు ఈ స్త‌వ‌మును సంస్కృత‌మున ర‌చియించిరి. వారి అనుగ్ర‌హ‌మున ప్ర‌తి దిన‌ము మూడు సంధ్య‌ల ప‌ఠించు భ‌క్తుడు కుబేరునితో స‌మాన‌ము కాగ‌ల‌డు.


ఆంగ్లం: IN SANKRIT WROTE THE LORD

SANKAR BY NAME, OUR BARD

I WRITE AND CRAVE HIS GUARD

FOR ALL MY FAULTS TO PARD'N

BY NAME I CARRY NO QUALITY (NIRGUNA)

IT IS TO YOU TO KNOW THE QUALITY. 

Wednesday, June 23, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-24

 

ఫ‌ల‌శ్రుతిః

శ్లోకం:  స్తువంతియేస్తుతిభి ర‌మీభిర‌న్వ‌హం

త్ర‌యీమ‌యీం త్రిభువ‌న మాత‌రం రమాం

గుణాధికా గురుత‌ర భాగ్య భాజినో

భ‌వంతి తేభువి బుధ‌భావితాశ‌యా


ప‌ద్యం:  శ్రుతుల త‌ల్లి ముజ్జ‌గ‌ముల న‌తుల‌నొందు

జ‌న‌ని శ్రీదేవి స్తుతియించు స్త‌వ‌ము దీన‌

ప్ర‌తి దిన‌ము స్తుతించు జ‌నులు భాగ్య‌ల‌బ్ధి

బుధ గుణాధికుల‌గుదురు భువిని స‌త‌ము


అర్థం: ఓ మాతా! భ‌క్తితో ప్ర‌తి దిన‌ము ఈ క‌న‌క ధారా స్త‌వ‌మును ప‌ఠించిన భ‌క్తులయింట త‌ల్లి ద‌య వ‌ల‌న క‌న‌క‌ధార‌లు వ‌ర్షించి, భ‌క్తులు స‌త్పురుషులు, ధ‌న‌వంతులు దీప్తిమంతులును కాగ‌ల‌రు.


ఆంగ్లం: THE EPILOGUE

AN THOU READ THESE RHYMES

ON MOTHER WITH DEVOTION THREE TIMES

A DAY, SHOWERS OF GOLDEN TIMES

BY MOTHER'S GRACE YOU GET ALL THE TIMES

TO BE RICH GOOD AND GAY,

IN SIMPLE FAITH I SAY.

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-23

 


 

శ్లోకం: అంభోరుహం జ‌న్మ‌గృహం భ‌వ‌త్యాః

వ‌క్ష‌స్థ‌లం భ‌ర్తృగృహం మురారేః

కారుణ్య‌తః క‌ల్ప‌య ప‌ద్మ‌వాసే! 

లీలాగృహం మే హృద‌యార వింద‌మ్‌


ప‌ద్యం: త‌మ్మి పుట్టిల్లు నీకు మాత‌! క‌మ‌లాక్షి!

మెట్టినిల్లు హ‌రి యుర‌ము  మించె నీకు

త‌మ్మి నివ‌సించు త‌ల్లి! నీ ద‌య‌ను సొగ‌సు

టిల్లుగా జేసి కొమ్ము నా యెడ‌ద‌, త‌ల్లి! 


అర్థం: ఓ ప‌ద్మాల‌యా! నీ పుట్టినిల్లు ప‌ద్మ‌ము. మురారి వ‌క్ష‌స్థ‌ల‌ము నీ మెట్టినిల్లు. నా హృద‌య‌మ‌నే ప‌ద్మ‌మును క‌రుణ‌తో నీ విలాస గృహ‌ముగా జేసికొమ్ము.


ఆంగ్లం: THOU ART BORN AS THE MILKY  OCEAN'S MAID

THOU HAST SOUGHT TO BE ON THE BOSOM OF THE LOTUS-EYED,

O! NATIVE OF THE LOTUS-SEAT

KINDLY TAKE MY HEART AS THY SEAT (FOR SPORT)

Wednesday, June 16, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-22




శ్లోకం:  క‌మ‌లాస‌న పాణినా ల‌లాటే

లిఖ‌తా మ‌క్ష‌ర‌పంక్తి మ‌స్య జంతోః

ప‌రి మార్జ‌య మాత రంఘ్రిణా తే

ధ‌నిక ద్వార నివాస దుఃఖ‌దోగ్ద్రీమ్‌


పద్యం:  ఈ న‌రు నుదుట చేత వ్రాయించె బ్ర‌హ్మ‌

వ‌ర్ణ పంక్తుల క‌ల‌వారి వాకిట ప‌డు

పాట్లు నాకు, మాత‌రో! నీదు పాద‌రేఖ‌

వ్రాత న‌ద్దాని తొల‌గింప జోత‌లిడుదు


అర్థం: ప‌ద్మమునందు నివ‌సించు బ్ర‌హ్మ ఈ ప్రాణి నుదుట వ్రాసిన అక్ష‌ర‌ముల బంతి ధ‌న‌వంతుల ద్వార‌మందు నివ‌సింప వ‌ల‌సిన దుఃఖ‌మును ప్రసాదించును. ఓ మాతా! ఆ వ్రాత‌ను నీ పాద ప‌ద్మ‌ముతో తుడిచివేయుము,


ఆంగ్లం: O! MOTHER! PRAY ERASE

THE SCRIPT THAT CREATOR MADE

ON MY FORE-HEAD AND MADE

ME SERVE THE RICH THAT TEASE

WITH A TOUCH OF THY PALM SO FINE

AND GIVE ME RELIEF OF A BALM DIVINE. 

Tuesday, June 15, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-21

 



శ్లోకం:  బిల్వాట‌వీ మ‌ధ్య ల‌స‌త్స‌రోజే

స‌హ‌స్ర ప‌త్రే సుఖా స‌న్నివిష్టాం

అష్టా ప‌దాం భోరుహ పాణిప‌ద్మాం

సువ‌ర్ణ వ‌ర్ణాం ప్ర‌ణ‌మామి ల‌క్ష్మీమ్‌


పద్యం: జ‌న‌ని! మారేడు  తోట‌లో స‌ర‌మునందు

వేయి రేకుల త‌మ్మిపై హాయి నుండి

పొన్ను దామ‌ర చేద‌మ్మి పూవుగాగ‌

వ‌న్నె బంగ‌రు స‌రి! నీకు వంద‌నంబు


అర్థం: మారేడు తోట‌లో వేయి రేకుల ప‌ద్మ‌మునందు సుఖ‌ముగా కూర్చుండి బంగారు తామ‌ర‌పువ్వు, ప‌ద్మ‌మువంటి చేత దాల్చి, బంగ‌రు రంగు గ‌ల ల‌క్ష్మీ దేవికి నేను న‌మ‌స్క‌రించెద‌ను.


ఆంగ్లం: THOR ART PLEASED TO REPOSE

BEARING THE LOTUS IN THY HANDS SOROSY

IN THE GARDEN OF DIVINE PLANTS

ON THE LOTUS OF A THOUSAND PETALS

THY BODY, IN COLOUR, EXCELS GOLD

I PRAY THEE, THY GRACE UNFOLD.

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-20


 

శ్లోకం:  క‌మ‌లే! క‌మ‌లాక్ష వ‌ల్ల‌భే! త్వం

క‌రుణా పూర తరంగితై ర‌పాంగైః

అవ‌లోక‌య మా మ‌కించ‌నానాం

ప్ర‌థ‌మం పాత్ర మ‌కృత్రిమం ద‌యాయాః


పద్యం: త‌మ్మికంటి వాని ప‌డ‌తి! తల్లి! నీవు

పేద‌ల మొద‌టి వాడ‌ను, నీదు ద‌య‌కు 

స‌హ‌జ పాత్రుడ‌ను క‌రుణాల‌హ‌రితోడ‌

కూడిన య‌ర‌గ‌న్నుల జూచి, కోర్కెలిమ్ము!


అర్థం: ఓ క‌మలాదేవీ! ప‌ద్మ‌ముల వంటి క‌న్నుల‌వాడైన శ్రీహ‌రి దేవేరీ! ద‌యాప్ర‌వాహ‌మున కెర‌ట‌ముల‌వ‌లె ఉన్న నీ  క్రీగంటి చూపుల‌తో, ద‌రిద్రుల‌యందు మొద‌టి వాడ‌ను, ద‌య‌కు స‌హ‌జ‌ముగా పాత్రుడ‌న‌గు న‌న్ను చూడ‌గోరెద‌ను.


ఆంగ్లం: O! LOTUS-BEAUTY! THOU ART

KIND AND GENEROUS, MY RESORT,

TO LOTUS-EYED, THE HAPPY CONSORT,

SHOWER THY GRACE ALL WEAL TO IMPORT

UNTO ME IN ALL MY LIFE

THY GRACE BECOMES ME SO FOR LIFE.


క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-19




శ్లోకం:  దిగ్ఘిస్త‌భిః క‌న‌క కుంభ ముఖావ‌సృష్ట‌

స్వ‌ర్వాహినీ విమ‌ల‌చారు జ‌ల‌ప్లుతాంగీం

ప్రాత‌ర్న‌మామి జ‌గ‌తాం జ‌న‌నీమ‌శేష‌

లోకాధినాథ గృహిణీ మ‌మృతాబ్ధి పుత్రీమ్‌


పద్యం: క‌డ‌ల‌యేన్గులు బంగారు క‌డ‌వ‌లంది

స్వ‌ర్గ గంగ‌జ‌ల‌ము పోయ స్నాన‌మాడు

లోక‌మాత‌! గృహిణి స‌ర్వ‌లోక‌నాథు

న‌క‌మృతాబ్ధి పుత్రి! ఉద‌య స‌తులు నీకు


అర్థం:  దిగ్గ‌జ‌ములు బంగ‌రు క‌డ‌వ‌ల‌నుండి వెద‌జ‌ల్లిన స్వ‌ర్గ‌మంద‌లి గంగాన‌దియంద‌లి విమ‌ల‌మై మ‌నోహ‌ర‌మైన జ‌ల‌ముతో త‌డియుచున్న శ‌రీర‌మును దాల్చి, జ‌గ‌ముల‌కు జ‌న‌నియు, స‌మ‌స్త‌లోక‌ముల‌కు నాధుడైన శ్రీనాథుని పత్నియు, అమృత‌సాగ‌ర క‌న్య‌యున‌గు శ్రీదేవికి ప్రాతఃకాల‌మున నేను న‌మ‌స్క‌రింతును.


ఆంగ్లం: FOR BATH, THE WHITE ELEPHANTS SHOWER

ON THEE, THE WATER OF THE DIVINE RIVER

PURE AND SCENTED, TO PLEASE THEE

EVERY MORN, I SALUTE TO THEE

O! DEAR MOTHER OF THE UNIVERSE,

HOUSE WIFE TO THE LORD OF THE UNIVERSE. 

Tuesday, June 8, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-18



శ్లోకం:  స‌ర‌జిన న‌య‌నే, స‌రోజ‌హ‌స్తే

ధ‌వ‌ళ‌త‌రాంకుశ గంధ‌మాల్య శోభే

భ‌గ‌వ‌తి హ‌రివల్ల‌భే మ‌నోజ్ఞే

త్రిభువ‌న భూతిక‌రి ప్ర‌సీద మ‌హ్యమ్‌!



ప‌ద్యం: త‌మ్మి క‌న్నుల మా త‌ల్లి! త‌మ్మిక‌ర‌ముల 

జ‌న‌ని! ధ‌వ‌ళ వ‌స్త్రమాల్య‌ముల వెలుగు

భ‌గ‌వ‌తి! హ‌రివ‌ల్ల‌భ త్రిభువన‌ముల‌కును

సిరినొస‌గు మాత‌! మాకును సిరినొసంగు


అర్థం:  ఓ త‌ల్లీ! నీ క‌న్నులు ప‌ద్మ‌ముల వంటివి. నీ చేతులు ప‌ద్మ‌ముల‌వంటివి. నీ వ‌స్త్ర‌ము మిక్కిలి తెల్ల‌నైన‌ది. మంచి గంథ‌మును పూల‌దండ‌ల‌ను నీకు శోభ‌ను క‌లుగ‌జేయును. ఓ భ‌గ‌వ‌తీ! శ్రీహ‌రి దేవేరీ! నా మ‌నస్సును తెలిసిన దాన‌వ‌మ్మా! మూడు భువ‌న‌ముల‌కు ఐశ్వ‌ర్య‌మునిచ్చు న‌ట్టి జ‌న‌నీ! నాయందు ప్ర‌స‌న్న‌వు క‌మ్ము!


ఆంగ్లం: THINE EYES ARE LIKE THE LOTUS 

THY HANDS WEAR THE LOTUS

THOU ART WHITER THAN THE WHITEST

THY LOOKS ARE BRIGHTER THAN THE BRIGHTEST

THY BODY EMITS INCENSE

O! GODDESS OF THE UNIVERSITY!

I PRAY THEE, CONSORT OF THE ALMIGHTY

FOR PROGRESS AND PROSPERITY. 

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-17


 

శ్లోకం: య‌త్క‌టాక్ష సముపాస‌నావిధిః

సేవ‌క‌స్య స‌క‌లార్థ సంప‌దః

సంత‌నోతి వ‌చ‌నాంగ మానసైః

త్వాం మురారి హృద‌యేశ్వ‌రీం భ‌జే



ప‌ద్యం: జ‌న‌ని! నీ క‌టాక్ష‌ముసేవ త‌నువు, మాట‌,

మ‌న‌సుతోడ సేవ‌కున‌కు మాన్య‌ముగ‌ను

సక‌ల సంప‌ద‌, స‌ర్వార్థ జాత‌మొస‌గు

మాత‌కు మురారి రాణికి జోత‌లిడుదు


అర్థం:  మురారికి హృద‌యేశ్వ‌రివైన దేవీ! నీ క‌టాక్ష‌ముల‌ను మాట‌ల‌తో, శ‌రీర‌ముతో, మ‌న‌స్సుతో ఉపాసించు సేవ‌కున‌కు స‌మ‌స్త కార్య‌సిద్ధ‌ని సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హించెద‌వు. ఓ త‌ల్లీ! నీ సేవ చేయుదును.


ఆంగ్లం: AT WHOSE KINDLY GLANCE OF GRACE

ALL KINDS OF RICHES REACH IN RACE

FOR SUCH A RAY OF GRACE, I PRAY

IN MIND WORD AND DEED, EVERY DAY,

THAT KIND LADY OF THE LOTUS-EYED

THAT SITS ON THE BOSOM OF THE LOTUS-EYED.

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-16



శ్లోకం: సంప‌త్క‌రాణి సంక‌లేంద్రియ శోభ‌నాని

సామ్రాజ్య దానవిభ‌వాని స‌రోరుహాక్షి

త్వ‌ద్వంద‌నాని దురితాహ‌ర‌ణోద్య‌తాని

మా మేవ‌మాత‌ర నిశంక‌ల‌యంతు మాన్యే


ప‌ద్యం: త‌మ్మికంటి త‌ల్లికిని వంద‌న‌ముల‌న్ని

సిరినొస‌గు నింద్రియ‌ముల‌కు సేమ‌మిచ్చు

దాన‌మిచ్చు సామ్రాజ్య‌మునైన‌, త‌ల్లి

పాప మ‌ణ‌చును నాయందు వ‌ర‌లునెపుడు


అర్థం: ప‌ద్మ‌ముల వంటి క‌న్నులు గ‌ల మాన్యురాలా! మాతా! సంప‌ద క‌లుగ‌జేయుచు, ఇంద్రియ‌ము ల‌న్నింటిని సంత‌సింప‌జేయుచు, సామ్రాజ్య‌ముల‌నైన దాన‌మీయ‌గ‌ల‌దై, పాప‌ములను న‌శింప‌జేయు ప్ర‌య‌త్న‌మందున్న మా న‌మ‌స్కార‌ములు. ఎల్ల‌ప్పుడూ మాకు శుభ‌ముల నిచ్చున‌ట్లు అనుగ్ర‌హింపుము.


ఆంగ్లం: LET ME PROSTRATE TO THY FEET

O! WORTHY GODDESS! O! MOTHER SWEET!

THOU GIVETH ALL PROSPERITY

TO DESTROY SINS IS THY PROPERTY

THOU GIVETH PLEASURES TO ALL SENSES

O! KIND MOTHER! GODDESS OF ALL TENSES

KINGDOMS ARE GAINED AT THY GRACE

O! LOTUS-EYED! CRAVE THY GRACE 

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-15



శ్లోకం: న‌మోస్తు! కాంత్యై క‌మ‌లేక్ష‌ణాయై

న‌మోస్తు! భూత్యై భువ‌న‌ప్ర‌సూత్యై

న‌మోస్తు! దేవాదిభి ర‌ర్చితాయై

న‌మోస్తు! నందాత్మ‌జ వ‌ల్ల‌భాయై


ప‌ద్యం:  కాంతికి న‌మోస్తు! తామ‌ర కంటిత‌ల్లి!

భూతికి న‌మోస్తు! త‌ల్లివి భువ‌న‌ముల‌కు

మాత‌రో! న‌మోస్తు! దేవాదిమాన్య‌! నీకు,

త‌ల్లిరో! న‌మోస్తు! నంద‌జుద‌యిత‌! నీకు


అర్థం: ప‌ద్మ‌ముల వంటి క‌న్నులు క‌ల కాంతికి న‌మ‌స్కార‌ము. భువ‌న‌ముల‌కు త‌ల్లియై సంప‌ద‌ల‌నిచ్చు దేవికి న‌మ‌స్కార‌ము. దేవ‌త‌లు మున్న‌గువారు పూజించు నీకు న‌మ‌స్కార‌ము. నంద‌నంద‌నుని దేవేరికి నీకు న‌మ‌స్కార‌ము.


ఆంగ్లం:  THE LOTUS-EYED LIGHT IN FORM, SALUTE TO THEE

O! GODDESS OF THE UNIVERSE, SALUTE TO THEE

THOU ART THE MOTHER OF UNIVERSE, SALUTE TO THEE

THOU ART WORSHIPPED BY GODS, SALUTE TO THEE

THE CONSORT OF NANDA'S SON, SALUTE TO THEE

GRANT ME ALL PROSPERITY, SALUTE TO THEE 

Sunday, June 6, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-14



శ్లోకం: న‌మోస్తు! దేవ్వై భృగునంద‌నాయై

న‌మోస్తు! విష్ణోరుర‌సి స్థితాయై

న‌మోస్తు! ల‌క్ష్మై క‌మ‌లాల‌యాయై

న‌మోస్తు! దామోదర వ‌ల్ల‌భాయై


ప‌ద్యం: వ‌ంద‌న‌ము దేవి! భృగుముని నంద‌న‌! నీకు

వంద‌న‌ము హ‌రియుర‌ము నీ వాస‌మ‌మ్మ‌!

వంద‌న‌ము ల‌క్ష్మీ! క‌మ‌ల‌నివాస‌! నీకు

వంద‌న‌ము ద‌మోద‌రు వ‌నిత‌! నీకు


అర్థం:  భృగు మ‌హ‌ర్షి పుత్రిక‌యైన దేవికి న‌మ‌స్కార‌ము. విష్ణుదేవుని వ‌క్ష‌మందు నివ‌సించు దేవికి న‌మ‌స్కార‌ము. ప‌ద్మ‌మందు నివ‌సించు ల‌క్ష్మీదేవికి న‌మ‌స్కార‌ము. వ‌న‌మాల ఉద‌ర‌మునందు గ‌ల శ్రీహ‌రి దేవేరికి న‌మ‌స్కార‌ము.


ఆంగ్లం: DAUGHTER OF THE GREAT SAINT (BHRUGU), SALUTE TO THEE,

SEATED ON THE LORD'S BOSOM, SALUTE TO THEE

O! NATIVE OF THE LOTUS-SEAT, SALUTE TO THEE

THE CONSORT OF OMNIPOTENT, SALUTE TO THEE


 

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-13





శ్లోకం: న‌మోస్తు! హేమాంబుజ పీఠికాయై

న‌మోస్తు! భూమండ‌ల నాయికాయై

న‌మోస్తు! దేవాది ద‌యా ప‌రాయై

న‌మోస్తు! శార్జ్గాయుధ వ‌ల్ల‌భాయై


ప‌ద్యం: వ‌ంద‌న‌ములమ్మ‌! త‌మ్మి నీ స్వ‌ర్ణ‌పీఠి

వంద‌న‌ములమ్మ‌! భువనైక పాలి! నీకు

వంద‌నము దేవ‌తా ద‌యా ప‌ర‌కు నీకు

వంద‌న‌ము కొమ్ము విల్దాల్పు వ‌నిత‌! నీకు


అర్థం:  బంగ‌రు ప‌ద్మ‌పీఠ‌మున వసించ నీకు న‌మ‌స్కార‌ము. భూమండ‌ల‌ము నేలు త‌ల్లికి నీకు న‌మ‌స్కార‌ము. దేవ‌త‌ల యందు ద‌య‌గ‌ల జ‌న‌నిని న‌మ‌స్కార‌ము. శార్జ్గ‌మ‌నెడి విల్లు ఆయుధ‌మైన శ్రీహ‌రి దేవేరికి న‌మ‌స్కార‌ము. 


ఆంగ్లం: GODDESS, SEATED ON THE GOLDEN LOTUS, SALUTE TO THEE

GODDESS OF ALL THE WORLDS, SALUTE TO THEE

THOU SHOWETH MERCY TO GODS, SALUTE TO THEE

THE CONSORT OF THE LORD WITH DIVINE BOW, SALUTE TO THEE 

Wednesday, June 2, 2021

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-12



శ్లోకం: న‌మోస్తు! నాళీక నిభాన‌నాయై

న‌మోస్తు! దుగ్ధోద‌ధి జ‌న్మ‌భూమ్యై

న‌మోస్తు! సోమామృత సోద‌రాయై

న‌మోస్తు! నారాయ‌ణ వ‌ల్ల‌భాయై


ప‌ద్యం: వంద‌న‌ములమ్మ పంక‌జ‌వ‌ద‌న‌! నీకు

వంద‌న‌ము నీదు పుట్టిలు పాల‌క‌డ‌లి

వంద‌న‌ము సోమ సుధ‌లు నీ వ‌రుస‌క‌వ‌లు

వంద‌న‌ము హ‌రిప్రియ‌! నీకు వంద‌నంబు


అర్థం: ప‌ద్మ‌ము వంటి ముఖ‌ము క‌ల ఓ త‌ల్లీ! నీకు న‌మ‌స్కార‌ము. పాల సంద్ర‌మందు జ‌న్మించిన త‌ల్లికి న‌మ‌స్కార‌ము. చంద్రున‌కు అమృత‌మున‌కు సోద‌రివైన నీకు న‌మ‌స్కార‌ము. నారాయ‌ణుని దేవేరి అయిన నీకు న‌మ‌స్కార‌ము.


ఆంగ్లం: THE BEAUTY OF LOTUS FACE, SALUTE TO THEE

THE NATIVE OF THE MILKY SEA, SALUTE TO THEE

THE SISTER OF MOON AND MANNA, SALUTE TO THEE

THE CONSORT OF THE LORD, SALUTE TO THEE. 

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-11



శ్లోకం: శ్రుత్యై న‌మోస్తు! శుభ‌క‌ర్మ ఫ‌ల‌ప్ర‌సూత్యై

ర‌త్యై న‌మోస్తు! ర‌మ‌ణీయ గుణార్ణ‌వాయై

శ‌క్యై న‌మోస్తు! శ‌త‌ప‌త్ర నికేత‌నాయై

పుష్య్టై న‌మోస్తు! పురుషోత్త‌య వ‌ల్ల‌భాయై


ప‌ద్యం:  శ్రుతుల‌కు న‌మోస్తు! క‌రుణింపు శుభ‌ఫ‌ల‌మ్ము

ర‌తికిని న‌మోస్తు! గుణ‌వార్ధి ర‌మ్య‌రూప‌

శ‌క్తికి న‌మోస్తు! శ‌త‌ప‌ద్మ! నీకు

పుష్టికి న‌మోస్తు! ఉత్త‌మ‌పురుషురాణి!


అర్థం:  శుభ‌క‌ర్మ‌ముల‌కు ఫ‌ల‌మునిచ్చు వేద‌మాత‌వ‌యిన నీకు న‌మ‌స్కార‌ము. ర‌మ‌ణీయ‌ములగు గుణ‌ముల‌కు స‌ముద్ర‌మైన సుంద‌రీ, నీకు న‌మ‌స్కార‌ము. నూరు రేకుల‌తో ఒప్పున‌ట్టి ప‌ద్మ‌ము నివాస‌మై శ‌క్తిరూప‌వ‌యిన నీకు న‌మ‌స్కార‌ము. పురుషుల‌యందు ఉత్త‌ముడ‌యిన శ్రీహ‌రికి దేవేరివై పుష్టిరూప‌వ‌గు నీకు న‌మ‌స్కార‌ము.


ఆంగ్లం: O GODDESS! THOU ART HYMNS EMBODIED, 

THOU GIVETH BOONS FOR GOOD DEEDS INDEED,

THOU ART THE GODDESS OF BEAUTY DIVINE

THOR ART THE SOURCE OF QUALITIES FINE,

THE LOTUS OF A THOUSAND PETALS IS THY SHRINE,

THOR ART POWER AND STRENGTH IN A FORM FO FINE,

THE CONSORT OF THE BEST OF MANLIHOOD,

I PRAY THEE TO DO ME GOOD.





 

Tuesday, June 1, 2021

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-10

 


శ్లోకం:  గీర్దీవ‌తేతి గ‌రుడ‌ధ్వ‌జ సుంద‌రీతి

శాకంభ‌రీతి శ‌శిశేఖ‌ర వ‌ల్ల‌భేతి

సృష్టి స్థితి ప్ర‌ళ‌య కేళిషు సంస్థితాయా

త‌స్యై న‌మ‌స్త్రిభువ‌నైక గురోస్త‌రుణ్యై


ప‌ద్యం:  వాణియ‌ని గ‌రుడారూఢు రాణియ‌నియు

గంగ‌దాల్ప‌రి చెలియ శ‌కంభ‌రియ‌ని

సృజ‌న ర‌క్ష‌ణ విల‌య సంస్థిత త్రిభువ‌న‌

పాల‌కునిదేవి సిరికి నా వంద‌న‌ములు


అర్థం: స‌ర‌స్వ‌తీ దేవి అనీ, గ‌రుడుని వాహ‌నునిగా చేసికొన్న శ్రీహ‌రి దేవేరి అనీ, శాకంభ‌రి అనీ, చంద్రుని శిరోమ‌ణిగా ధ‌రించిన ప‌ర‌మ‌శివుని ప‌త్నియైన పార్వ‌తి అనీ, సృష్టినీ, ప్ర‌ళ‌యమునూ ఆట‌లుగా నెర‌వేర్చుచు, మూడు లోక‌ముల‌కు గుర‌వైన శ్రీహ‌రి ప‌త్నికి న‌మ‌స్కార‌ము


ఆంగ్లం: SALUTE TO THEE, THE CONSORT OF THE LORD OF WORLDS

THY LORD IS THE ONLY TEACHER OF ALL THE WORLDS,

THOU SEEM TO TAKE THE FORMS THREE

TO CREATE, KEEP AND DISTROY,

AS THE GODDESS OF WISDOM, OR OF WEALTH,

OR THE DELUGE, THOU SEEM TO BE AT TIMES,

I WORSHIP THEE IN MY RHYMES,

O! GODDESS KINDLY GRANT ME WEALTH.




క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-9

 


శ్లోకం: ఇష్టా విశిష్ట మ‌త‌యోపి య‌యా ద‌యార్ద్ర‌

దృష్ట్యా త్రివిష్ట‌ప ప‌దం సుల‌భం ల‌భంతే,

దృష్టిః ప్ర‌హృష్ట క‌మ‌లోద‌ర దీప్తి రిష్టాం

పుష్టిం కృషిష్ట మ‌మ పుష్క‌ర విష్ట‌రాయాః


ప‌ద్యం: ఇష్టులు విశిష్ట‌బుద్ధులు ఏ ద‌య‌గ‌ల‌

చూపున త్రివిష్ట‌ప ప‌ద‌వి సుల‌భ‌రీతి

పొందుచుందురా, సిరిత‌మ్మి బొడ్డుపోలు

దృష్టి నాకిష్ట పుష్టుల తీర్చుగాక‌!


అర్థం: త‌మ్మి పీట నివాస‌మైన శ్రీదేవి ద‌యార్ద్ర‌మైన చూపు వ‌ల‌న విశిష్ట‌మైన బుద్ధిగ‌ల ఇష్ట జ‌నులు స్వ‌ర్గ‌మును సుల‌భంగా పొందుచున్నారు. ఆనంద‌మ‌య‌మైన ప‌ద్మ‌పీఠ‌మును ప్ర‌కాశింప జేసిన ఆ దృష్టి నాకు ఇష్ట‌మైన పుష్టిని అనుగ్ర‌హించుగాక‌! 


ఆంగ్లం: ALBEIT ONE DOES NO DEEDS OF PIETY

GETS THE LORDSHIP OF HEAVEN,

THE GREATEST DIETY, 

ARE THY LOOKS OF GRACE ON HIM BESTOW

SUCH LOOKS OF GRACE ON ME BESTOW

Thursday, May 27, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-8



శ్లోకం: ద‌ద్యాద్ద‌యా సుప‌వ‌నో ద్ర‌విణాంబుధారాం

ఆస్మిన్న కించ‌న విహంగ‌శిశౌ విష‌ణ్ణే

దుష్క‌ర్మ ఘ‌ర్మ  మ‌ప‌నీయ చిరాయ‌దూరం

నారాయ‌ణ ప్ర‌ణ‌య‌నీ న‌య‌నాంబు వాహః


ప‌ద్యం:  దీన ద‌రిద్ర‌మౌ ప‌క్షి కూన‌యిద్ది

దీని పాప‌పు వేస‌వి దీర్చి ద‌వ్వు

జేసి నారాయ‌ణును విద సిరిక‌ను మొయి

లు, ద‌య వాయువై ధ‌న‌ధార‌లు కురిపించు


అర్థం: అజ్ఞానియు, దీన‌మున‌యిన ఈ ప‌క్షిపిల్ల మీద పాప‌మ‌నెడు వేస‌విని చిర‌కాల‌ము దూర‌ముగా జేసి, ద‌య అనెడి వాయువుతో గూడి, నారాయ‌ణుని ప్రియురాల‌గు శ్రీదేవి క‌న్ను అనెడి మేఘ‌ము ధ‌న‌మ‌నెడి నీటిధార‌ను అనుగ్ర‌హించుగాక‌!


ఆంగ్లం: MAY THE GODDESS OF WEALTH

SHOWER AS A CLOUD, ALL WEALTH

UNTO ME, A THIRSTY BIRD

OPPRESSED BY SINS AND MISERY UNHEARD,

AS SHOWERS LOOKS OF PASSION

ON THE LORD THAT SLEEPS ON THE OCEAN. 

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-7


 

శ్లోకం:  బాహ్వంత‌రే మ‌ధుజిత శ్రిత కౌస్తుభేయా

హారావ‌ళీవ హ‌రినీల‌మ‌యీ విభాతి

కామ‌ప్ర‌దా భ‌గ‌వ‌తోపి క‌టాక్ష‌మాలా

క‌ళ్యాణ మావ‌హ‌తు మే క‌మ‌లాల‌యాయాః


ప‌ద్యం: హ‌రిభుజాంత‌ర కౌస్తుభ‌మందు వెలుగు

ఇంద్ర‌నీల‌హార‌మువోలె నెంతో మించు

క‌మ‌ల క్రీగ‌న్ను శ్రీహ‌రి కామ‌దాత్రి

అట్ట య‌ర‌గ‌న్ను నాకు క‌ళ్యాణ‌మొస‌గు


అర్థం: మథువ‌ను ర‌క్క‌సుని జ‌యించిన శ్రీహ‌రి బాహువుల న‌డుమగ‌ల కౌస్తుభ‌మ‌ణియందు ఇంద్ర‌నీల మ‌ణుల హార‌మువ‌లె ప్ర‌కాశించుచు, భ‌గ‌వాన్ శ్రీహ‌రికిని కోరిక‌ల‌ను ఒస‌గున‌దై ప‌ద్మ‌మునందు నివ‌సించు శ్రీదేవి క్రీగంటి చూపుల దండ నాకు క‌ళ్యాణ‌మును అనుగ్ర‌హించుగాక‌! 


ఆంగ్లం: THE   LORD WEARS THE HOLY DIAMOND

HE BEARS THE GODDESS IN LOVING BOND

SHE SHINES AND EXCELS THE  HOLY DIAMOND

AS A LOTUS-BEAUTY IN A HOLY-POND

ON HIS AZURE BODY DIVINE

MAY SHE GRACE ME WEALS TO GAIN

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-6



శ్లోకం:  కాలాంబు రాశి ల‌లితోర‌సికైట‌భారేః

థారాధ‌రే స్ఫుర‌తి యాత‌టిదంగ‌నేవ

మాతు స్స‌మ‌స్త‌ జ‌గ‌తాం మ‌హ‌నీయమూర్తిః

భ‌ద్రాణి మే దిశ‌తు భార్గ‌వనంద‌నాయాః


ప‌ద్యం:  కారు మ‌బ్బుల పోలిన కైట‌భారి

ఉరమునందు మ‌బ్బుల మీద మెర‌పు వోలె

భార్గ‌వి! భువ‌న‌మాత‌! శ్రీ భాగ్య దేవి

దివ్య‌మూర్తి భ‌ద్ర‌ము నాకు దిప్తి నొస‌గు


అర్థం:  కైట‌భాసురుని సంహ‌రించిన శ్రీహ‌రి మ‌బ్బు ఛాయ‌ను పోలు హృద‌యము మీద‌, నీల‌మేఘ‌మున మెర‌యున‌ట్టి మెర‌పు ప‌డుచువ‌లె, స‌మ‌స్త జ‌గ‌ముల‌కు మాత‌యైన, భార్గ‌వ‌ముని పుత్రిక‌య‌గు శ్రీదేవి దివ్య‌మూర్తి నాకు భ‌ద్ర‌ముల‌ను అనుగ్ర‌హించుగాక!


ఆంగ్లం: THE LORD BLUE AS A CLOUD

SHE, AS A LIGHTNING ON THE LORD'S CLOUD

IS A DAMSEL ABOVE ALL WORDS,

SHE IS THE MOTHER OF ALL WORLDS,

MAY THAT GODDESS OF PLEASING BEAUTY

GRANT ME ALL THE WORLDLY BOOTY


 

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-5



శ్లోకం: ఆమీలితాక్ష మ‌థిగ‌మ్య ముదా ముకుదం

ఆనంద కంద మ‌నిమేష మ‌నంగ తంత్రం

ఆకేక‌ర స్థిత క‌నీనిక ప‌ద్మ నేత్రం

భూత్యై భ‌వేన్మ‌మ భుజంగ శ‌యాంగనాయాః


ప‌ద్యం:  రెప్ప వేయ‌క మ‌న్మ‌ధ‌రీతిలోగి

ముద‌ము న‌ర‌మోడ్పు గ‌న్నుల ముర‌రిపున‌కు

క‌నుకొన‌ల యందు పాస‌ల క‌లిమి తీర్చి

క‌మ‌ల క్రీగ‌న్ను నాయందు క‌లిమి చేర్చు


అర్థం:  ముకుందుని అర‌గ‌న్నుతో సంతోష‌మున చేరి, ఆనంద‌మున‌కు మూల‌మై, రెప్ప‌పాటు లేక మ‌న్మ‌ధుని ప్ర‌భావ‌మును పొంది, క‌నుకొన‌లందు క‌నుపాప‌లు చేర‌గా ఆదిశేషునిపై ప‌వ్వ‌ళించిన శ్రీహ‌రి దేవేరి చూపు నాకు సంప‌ద‌ను అనుగ్ర‌హించునుగాక‌!


ఆంగ్లం: WITH HALF-OPEN EYES SITS THE LOTUS-EYED

WITH SIDE-LONG LOOKS OF LOVE REACHES HIS SIDE

THE GODDESS OF WEALTH AT CUPID'S INFLUENCE

MAY THAT GODDESS GRANT ME WEALTH IN GLANCE



Wednesday, May 26, 2021

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-4

 


శ్లోకం:  విశ్వామ‌రేంద్ర ప‌ద విభ్ర‌మ దాన ద‌క్షం

ఆనంద హేతు రథికం ముర విద్విష్యోపి

ఈష‌న్నిషీద‌తు మ‌యిక్ష‌ణ మీక్ష‌ణార్థం

ఇందీవ‌రోద‌ర స‌హెద‌ర మిందిరాయాః


ప‌ద్యం: క‌లువ బొడ్డు బోలిన సిరి కంటి చూపు

ముర రిపున‌కును మిక్కిలి మోద‌మొస‌గు

దాన‌మిచ్చు దేవేంద్ర ప‌దంబునైన‌

అట్టి య‌ర‌గ‌న్ను నాయందు న‌ల‌రు గాత‌


అర్థం:  విశ్వ‌మున దేవేంద్ర ప‌ద‌విని గూడ ప్ర‌సాదింప  గ‌లిగి, మురారి ఆనంద‌మున‌కు ముఖ్య‌కార‌ణ‌మ‌యి, క‌లువ‌బొడ్డు దోడ‌యిన శ్రీదేవి క్రీగంటి చూపు నాయందు క్ష‌ణ‌ము నిలుచుగాక‌!


ఆంగ్లం: THAT GRANTS LORDSHIP OF HEAVEN

THAT GIVES PLEASURE TO THE LORD OF LORDS EVEN

SUCH A LOOK OF GRACE 

MAY FALL ON ME ONCE

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-3



ప‌ద్యం:  ముగ్ధా ముహుర్వ‌ద‌ధ‌తీ వ‌ద‌నే మురారేః

ప్రేమ‌త్ర పాప్ర‌ణి హితాని గ‌తాగ‌తాని

మాలా దృశోర్మ‌ధుక‌రీవ మ‌హోత్ప‌లేయా

సామే శ్రియం దిశ‌తు సాగ‌ర సంభ‌వాయాః


ప‌ద్యం:  తేటి త‌మ్మిపైబోలె శ్రీదేవి చూపు

హ‌రి వ‌ద‌నమందు ముగ్ధ‌మై మ‌ర‌ల మ‌ర‌ల‌

ప్రేమ నును సిగ్గు దొంత‌ర ప్రేముడించి 

రాక‌పోక‌ల‌లో సిరి నాకు నొస‌గు


అర్థం: ప‌ద్మ‌ముపై ఆడు తుమ్మెద‌వ‌లె మురారి ముఖ‌మునందు మ‌నోహ‌ర‌ముగా ప్రేమ‌తో సిగ్గుతో మాటిమాటికి రాక‌పోక‌లు చేయుచున్న క‌డ‌లి కుమార్తె చూపుల దండ నాకు సంప‌ద‌ను అనుగ్ర‌హించు గాక‌!


ఆంగ్లం: AS A BEE GOES TO A LILLY (BLUE) IN BLOOM

SO THY LOOKS GO TO THE LORD BLUE

AS THE BEE OFTEN GOES ABOUT

SO THY LOOKS IN SHYNESS GO ABOUT

REPEATING VISITS OF LOVE AND PASSION

SUCH REPEATING LOOKS OF THE MAID OF THE OCEAN, 

MAY GRANT ME TREASURES

AND ALL KINDS OF PLEASURES! 

క‌న‌క ధార‌- ఆంగ్ల‌ధార‌!-2

 


శ్లోకం: అంగంహ‌రేః పుల‌క భూష‌ణ‌మాశ్ర‌యంతీ

భృంగాంగ‌నేవ ముకుళాభ‌ర‌ణం త‌మాలం

అంగీకృతాఖిల విభూతి ర‌పాంగ‌లీలా

మాంగ‌ల్య‌దాస్తు మ‌మ మంగ‌ళ దేవాతాయాః 


ప‌ద్యం:  పుల‌క తొడ‌వుల హ‌రిమేను క‌లియ‌జూడ‌

తేటి చీక‌టి మొగ్గ‌ల సాటిదెలుప‌

మంగ‌ళాదేవి క్రేగ‌న్ను మ‌హిమ‌

అఖిల సంప‌త్తితోడ న‌న్న‌ల‌ర‌జేయు

 

అర్థం:  శ్రీహ‌రి పుల‌క‌లు అలంక‌రించుకొన్న శ‌రీర‌మును మొగ్గ‌లు అలంకార‌ముగానున్న చీక‌టి చెట్టును ఆడుతుమ్మెద‌ల‌వ‌లె ఆశ్ర‌యించి, స‌మ‌స్త సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హించున‌ట్టి శ్రీదేవి క‌టాక్ష విలాస‌ము నాకు శుభ‌మును ఒస‌గుగాక‌!


ఆంగ్లం: AS THE  HONEY-BEES SWARM A BOWER

WITH MANY A HONEYED FLOWER

SO THY PLEASING LOOKS GRAZE

ON THE LOTUS-EYED IN BOUNDLESS PLEASURE

MAY SUCH LOOKS OF THY GRACE

GRANT ME BOUNDLESS PLEASURE!

Wednesday, May 19, 2021

క‌న‌క‌ధార‌... ఆంగ్లధార‌!-1

 

ఆది గురువు శంక‌రాచార్యులు  సంస్కృతంలో ఆశువుగా అనుగ్ర‌హించిన క‌న‌క‌ధారా స్త‌వ‌ము శ్లోకాల‌ను ఆంగ్లంలోకి అనువ‌దించాల‌నేది నాన్న‌గారి సంక‌ల్పం. ఆ సంక‌ల్పానికి తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట శ్రీ క‌న‌క దుర్గా ప‌బ్లికేష‌న్స్ వారి స‌హ‌కారం తోడై పుస్త‌క‌రూపం దాల్చింది. అయితే ఆ పుస్త‌కాన్ని చూసుకోకుండానే ఆయ‌న మ‌ర‌ణించ‌డం విధివిలాసం. 



ఆ పుస్త‌కం కోసం ఆయ‌న  5.11.1978 తేదీతో ముందు మాట రాశారు. ఆ  పుస్త‌కం ప్ర‌చురుణ స‌న్నాహాల‌లో ఉండ‌గానే ఆయ‌న 23.11.1978 నాడు హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం విడుద‌లైన ఆ పుస్త‌కంలో ఆయ‌నకు శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. 



నాన్న‌గారి స్నేహితులు, అప్ప‌ట్లో మండ‌పేట కాలేజీ ప్రిన్నిపాల్ ప‌న్నాల భ‌ట్ట‌శ‌ర్మ గారు ఆ పుస్త‌కంలో క‌న‌క‌ధార స్త‌వం శ్లోకాల‌కు తెలుగు ప‌ద్యాలు రాయ‌గా, అదే కాలేజీలో ఆంగ్ల అధ్యాప‌కులుగా ప‌నిచేసిన నాన్న‌గారు ఇంగ్లిషు  ప‌ద్యాలు రాశారు. సంస్కృత శ్లోకాలు, తెలుగు అర్థం, తెలుగు ప‌ద్యాలు, ఆంగ్ల ప‌ద్యాల‌తో ఆ పుస్త‌కం ఎంతో అపురూప‌మైన‌దిగా రూపుదిద్దుకుంది. 

అందులోని ప‌ద్యాల‌ను ఆయ‌న పేరుతో నేను ప్రారంభించిన బ్లాగులో పెట్టాల‌నేది నా త‌ప‌న‌. అవ‌లోకించండి.

.........



శ్లోకం: వ‌ందే  వందారు మందారం

ఇందిరానంద కంద‌ళ‌మ్‌

అమందానంద సందోహ 

బంధురం సింధురాన‌న‌మ్‌.


ప‌ద్యం: వ‌ంద‌న‌ముల‌కు క‌ల్ప‌క బృంద‌మొస‌గి

ఇందిరాదేవి యానంద మింపుజేసి

సంత‌తానంద సందోహ సంభ్ర‌ముడ‌వు

వ‌ద‌న గ‌జ‌దేవ‌! వంద‌నా వంద‌న‌ములు


అర్థం: వ‌ంద‌న‌ము చేయువారికి క‌ల్ప‌వృక్ష‌మును, ల‌క్ష్మీదేవి ఆనంద‌మున‌కు మూల‌మును, అప‌రిమిత‌మైన ఆనంద‌ము నొస‌గున‌ట్టి గ‌జ‌ముఖున‌కు నా న‌మ‌స్కార‌ము.


 ఆంగ్లం:

TO HIM I SALUTE, THE SOURCE OF PLEASURE
TO GOURI AND SANKAR, THE PARENTS DIVINE
WHO SHOWERS FAVOURS TO DEVOTEES AS THE TREE DIVINE
AND WHOSE   COOLRAYS OF SMILE GIVETH  PLEASURE.