శ్లోకం: గీర్దీవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయా
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై
పద్యం: వాణియని గరుడారూఢు రాణియనియు
గంగదాల్పరి చెలియ శకంభరియని
సృజన రక్షణ విలయ సంస్థిత త్రిభువన
పాలకునిదేవి సిరికి నా వందనములు
అర్థం: సరస్వతీ దేవి అనీ, గరుడుని వాహనునిగా చేసికొన్న శ్రీహరి దేవేరి అనీ, శాకంభరి అనీ, చంద్రుని శిరోమణిగా ధరించిన పరమశివుని పత్నియైన పార్వతి అనీ, సృష్టినీ, ప్రళయమునూ ఆటలుగా నెరవేర్చుచు, మూడు లోకములకు గురవైన శ్రీహరి పత్నికి నమస్కారము
ఆంగ్లం: SALUTE TO THEE, THE CONSORT OF THE LORD OF WORLDS
THY LORD IS THE ONLY TEACHER OF ALL THE WORLDS,
THOU SEEM TO TAKE THE FORMS THREE
TO CREATE, KEEP AND DISTROY,
AS THE GODDESS OF WISDOM, OR OF WEALTH,
OR THE DELUGE, THOU SEEM TO BE AT TIMES,
I WORSHIP THEE IN MY RHYMES,
O! GODDESS KINDLY GRANT ME WEALTH.

No comments:
Post a Comment