Wednesday, June 2, 2021

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-11



శ్లోకం: శ్రుత్యై న‌మోస్తు! శుభ‌క‌ర్మ ఫ‌ల‌ప్ర‌సూత్యై

ర‌త్యై న‌మోస్తు! ర‌మ‌ణీయ గుణార్ణ‌వాయై

శ‌క్యై న‌మోస్తు! శ‌త‌ప‌త్ర నికేత‌నాయై

పుష్య్టై న‌మోస్తు! పురుషోత్త‌య వ‌ల్ల‌భాయై


ప‌ద్యం:  శ్రుతుల‌కు న‌మోస్తు! క‌రుణింపు శుభ‌ఫ‌ల‌మ్ము

ర‌తికిని న‌మోస్తు! గుణ‌వార్ధి ర‌మ్య‌రూప‌

శ‌క్తికి న‌మోస్తు! శ‌త‌ప‌ద్మ! నీకు

పుష్టికి న‌మోస్తు! ఉత్త‌మ‌పురుషురాణి!


అర్థం:  శుభ‌క‌ర్మ‌ముల‌కు ఫ‌ల‌మునిచ్చు వేద‌మాత‌వ‌యిన నీకు న‌మ‌స్కార‌ము. ర‌మ‌ణీయ‌ములగు గుణ‌ముల‌కు స‌ముద్ర‌మైన సుంద‌రీ, నీకు న‌మ‌స్కార‌ము. నూరు రేకుల‌తో ఒప్పున‌ట్టి ప‌ద్మ‌ము నివాస‌మై శ‌క్తిరూప‌వ‌యిన నీకు న‌మ‌స్కార‌ము. పురుషుల‌యందు ఉత్త‌ముడ‌యిన శ్రీహ‌రికి దేవేరివై పుష్టిరూప‌వ‌గు నీకు న‌మ‌స్కార‌ము.


ఆంగ్లం: O GODDESS! THOU ART HYMNS EMBODIED, 

THOU GIVETH BOONS FOR GOOD DEEDS INDEED,

THOU ART THE GODDESS OF BEAUTY DIVINE

THOR ART THE SOURCE OF QUALITIES FINE,

THE LOTUS OF A THOUSAND PETALS IS THY SHRINE,

THOR ART POWER AND STRENGTH IN A FORM FO FINE,

THE CONSORT OF THE BEST OF MANLIHOOD,

I PRAY THEE TO DO ME GOOD.





 

No comments:

Post a Comment