Tuesday, June 15, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-20


 

శ్లోకం:  క‌మ‌లే! క‌మ‌లాక్ష వ‌ల్ల‌భే! త్వం

క‌రుణా పూర తరంగితై ర‌పాంగైః

అవ‌లోక‌య మా మ‌కించ‌నానాం

ప్ర‌థ‌మం పాత్ర మ‌కృత్రిమం ద‌యాయాః


పద్యం: త‌మ్మికంటి వాని ప‌డ‌తి! తల్లి! నీవు

పేద‌ల మొద‌టి వాడ‌ను, నీదు ద‌య‌కు 

స‌హ‌జ పాత్రుడ‌ను క‌రుణాల‌హ‌రితోడ‌

కూడిన య‌ర‌గ‌న్నుల జూచి, కోర్కెలిమ్ము!


అర్థం: ఓ క‌మలాదేవీ! ప‌ద్మ‌ముల వంటి క‌న్నుల‌వాడైన శ్రీహ‌రి దేవేరీ! ద‌యాప్ర‌వాహ‌మున కెర‌ట‌ముల‌వ‌లె ఉన్న నీ  క్రీగంటి చూపుల‌తో, ద‌రిద్రుల‌యందు మొద‌టి వాడ‌ను, ద‌య‌కు స‌హ‌జ‌ముగా పాత్రుడ‌న‌గు న‌న్ను చూడ‌గోరెద‌ను.


ఆంగ్లం: O! LOTUS-BEAUTY! THOU ART

KIND AND GENEROUS, MY RESORT,

TO LOTUS-EYED, THE HAPPY CONSORT,

SHOWER THY GRACE ALL WEAL TO IMPORT

UNTO ME IN ALL MY LIFE

THY GRACE BECOMES ME SO FOR LIFE.


No comments:

Post a Comment