శ్లోకం: అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే!
లీలాగృహం మే హృదయార విందమ్
పద్యం: తమ్మి పుట్టిల్లు నీకు మాత! కమలాక్షి!
మెట్టినిల్లు హరి యురము మించె నీకు
తమ్మి నివసించు తల్లి! నీ దయను సొగసు
టిల్లుగా జేసి కొమ్ము నా యెడద, తల్లి!
అర్థం: ఓ పద్మాలయా! నీ పుట్టినిల్లు పద్మము. మురారి వక్షస్థలము నీ మెట్టినిల్లు. నా హృదయమనే పద్మమును కరుణతో నీ విలాస గృహముగా జేసికొమ్ము.
ఆంగ్లం: THOU ART BORN AS THE MILKY OCEAN'S MAID
THOU HAST SOUGHT TO BE ON THE BOSOM OF THE LOTUS-EYED,
O! NATIVE OF THE LOTUS-SEAT
KINDLY TAKE MY HEART AS THY SEAT (FOR SPORT)

No comments:
Post a Comment