Sunday, June 6, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-13





శ్లోకం: న‌మోస్తు! హేమాంబుజ పీఠికాయై

న‌మోస్తు! భూమండ‌ల నాయికాయై

న‌మోస్తు! దేవాది ద‌యా ప‌రాయై

న‌మోస్తు! శార్జ్గాయుధ వ‌ల్ల‌భాయై


ప‌ద్యం: వ‌ంద‌న‌ములమ్మ‌! త‌మ్మి నీ స్వ‌ర్ణ‌పీఠి

వంద‌న‌ములమ్మ‌! భువనైక పాలి! నీకు

వంద‌నము దేవ‌తా ద‌యా ప‌ర‌కు నీకు

వంద‌న‌ము కొమ్ము విల్దాల్పు వ‌నిత‌! నీకు


అర్థం:  బంగ‌రు ప‌ద్మ‌పీఠ‌మున వసించ నీకు న‌మ‌స్కార‌ము. భూమండ‌ల‌ము నేలు త‌ల్లికి నీకు న‌మ‌స్కార‌ము. దేవ‌త‌ల యందు ద‌య‌గ‌ల జ‌న‌నిని న‌మ‌స్కార‌ము. శార్జ్గ‌మ‌నెడి విల్లు ఆయుధ‌మైన శ్రీహ‌రి దేవేరికి న‌మ‌స్కార‌ము. 


ఆంగ్లం: GODDESS, SEATED ON THE GOLDEN LOTUS, SALUTE TO THEE

GODDESS OF ALL THE WORLDS, SALUTE TO THEE

THOU SHOWETH MERCY TO GODS, SALUTE TO THEE

THE CONSORT OF THE LORD WITH DIVINE BOW, SALUTE TO THEE 

No comments:

Post a Comment