శ్లోకం: కమలాసన పాణినా లలాటే
లిఖతా మక్షరపంక్తి మస్య జంతోః
పరి మార్జయ మాత రంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ద్రీమ్
పద్యం: ఈ నరు నుదుట చేత వ్రాయించె బ్రహ్మ
వర్ణ పంక్తుల కలవారి వాకిట పడు
పాట్లు నాకు, మాతరో! నీదు పాదరేఖ
వ్రాత నద్దాని తొలగింప జోతలిడుదు
అర్థం: పద్మమునందు నివసించు బ్రహ్మ ఈ ప్రాణి నుదుట వ్రాసిన అక్షరముల బంతి ధనవంతుల ద్వారమందు నివసింప వలసిన దుఃఖమును ప్రసాదించును. ఓ మాతా! ఆ వ్రాతను నీ పాద పద్మముతో తుడిచివేయుము,
ఆంగ్లం: O! MOTHER! PRAY ERASE
THE SCRIPT THAT CREATOR MADE
ON MY FORE-HEAD AND MADE
ME SERVE THE RICH THAT TEASE
WITH A TOUCH OF THY PALM SO FINE
AND GIVE ME RELIEF OF A BALM DIVINE.

No comments:
Post a Comment