శ్లోకం: సరజిన నయనే, సరోజహస్తే
ధవళతరాంకుశ గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్!
పద్యం: తమ్మి కన్నుల మా తల్లి! తమ్మికరముల
జనని! ధవళ వస్త్రమాల్యముల వెలుగు
భగవతి! హరివల్లభ త్రిభువనములకును
సిరినొసగు మాత! మాకును సిరినొసంగు
అర్థం: ఓ తల్లీ! నీ కన్నులు పద్మముల వంటివి. నీ చేతులు పద్మములవంటివి. నీ వస్త్రము మిక్కిలి తెల్లనైనది. మంచి గంథమును పూలదండలను నీకు శోభను కలుగజేయును. ఓ భగవతీ! శ్రీహరి దేవేరీ! నా మనస్సును తెలిసిన దానవమ్మా! మూడు భువనములకు ఐశ్వర్యమునిచ్చు నట్టి జననీ! నాయందు ప్రసన్నవు కమ్ము!
ఆంగ్లం: THINE EYES ARE LIKE THE LOTUS
THY HANDS WEAR THE LOTUS
THOU ART WHITER THAN THE WHITEST
THY LOOKS ARE BRIGHTER THAN THE BRIGHTEST
THY BODY EMITS INCENSE
O! GODDESS OF THE UNIVERSITY!
I PRAY THEE, CONSORT OF THE ALMIGHTY
FOR PROGRESS AND PROSPERITY.

No comments:
Post a Comment