శ్లోకం: నమోస్తు! కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు! భూత్యై భువనప్రసూత్యై
నమోస్తు! దేవాదిభి రర్చితాయై
నమోస్తు! నందాత్మజ వల్లభాయై
పద్యం: కాంతికి నమోస్తు! తామర కంటితల్లి!
భూతికి నమోస్తు! తల్లివి భువనములకు
మాతరో! నమోస్తు! దేవాదిమాన్య! నీకు,
తల్లిరో! నమోస్తు! నందజుదయిత! నీకు
అర్థం: పద్మముల వంటి కన్నులు కల కాంతికి నమస్కారము. భువనములకు తల్లియై సంపదలనిచ్చు దేవికి నమస్కారము. దేవతలు మున్నగువారు పూజించు నీకు నమస్కారము. నందనందనుని దేవేరికి నీకు నమస్కారము.
ఆంగ్లం: THE LOTUS-EYED LIGHT IN FORM, SALUTE TO THEE
O! GODDESS OF THE UNIVERSE, SALUTE TO THEE
THOU ART THE MOTHER OF UNIVERSE, SALUTE TO THEE
THOU ART WORSHIPPED BY GODS, SALUTE TO THEE
THE CONSORT OF NANDA'S SON, SALUTE TO THEE
GRANT ME ALL PROSPERITY, SALUTE TO THEE

No comments:
Post a Comment