Tuesday, June 15, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-19




శ్లోకం:  దిగ్ఘిస్త‌భిః క‌న‌క కుంభ ముఖావ‌సృష్ట‌

స్వ‌ర్వాహినీ విమ‌ల‌చారు జ‌ల‌ప్లుతాంగీం

ప్రాత‌ర్న‌మామి జ‌గ‌తాం జ‌న‌నీమ‌శేష‌

లోకాధినాథ గృహిణీ మ‌మృతాబ్ధి పుత్రీమ్‌


పద్యం: క‌డ‌ల‌యేన్గులు బంగారు క‌డ‌వ‌లంది

స్వ‌ర్గ గంగ‌జ‌ల‌ము పోయ స్నాన‌మాడు

లోక‌మాత‌! గృహిణి స‌ర్వ‌లోక‌నాథు

న‌క‌మృతాబ్ధి పుత్రి! ఉద‌య స‌తులు నీకు


అర్థం:  దిగ్గ‌జ‌ములు బంగ‌రు క‌డ‌వ‌ల‌నుండి వెద‌జ‌ల్లిన స్వ‌ర్గ‌మంద‌లి గంగాన‌దియంద‌లి విమ‌ల‌మై మ‌నోహ‌ర‌మైన జ‌ల‌ముతో త‌డియుచున్న శ‌రీర‌మును దాల్చి, జ‌గ‌ముల‌కు జ‌న‌నియు, స‌మ‌స్త‌లోక‌ముల‌కు నాధుడైన శ్రీనాథుని పత్నియు, అమృత‌సాగ‌ర క‌న్య‌యున‌గు శ్రీదేవికి ప్రాతఃకాల‌మున నేను న‌మ‌స్క‌రింతును.


ఆంగ్లం: FOR BATH, THE WHITE ELEPHANTS SHOWER

ON THEE, THE WATER OF THE DIVINE RIVER

PURE AND SCENTED, TO PLEASE THEE

EVERY MORN, I SALUTE TO THEE

O! DEAR MOTHER OF THE UNIVERSE,

HOUSE WIFE TO THE LORD OF THE UNIVERSE. 

No comments:

Post a Comment