శ్లోకం: సంపత్కరాణి సంకలేంద్రియ శోభనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మా మేవమాతర నిశంకలయంతు మాన్యే
పద్యం: తమ్మికంటి తల్లికిని వందనములన్ని
సిరినొసగు నింద్రియములకు సేమమిచ్చు
దానమిచ్చు సామ్రాజ్యమునైన, తల్లి
పాప మణచును నాయందు వరలునెపుడు
అర్థం: పద్మముల వంటి కన్నులు గల మాన్యురాలా! మాతా! సంపద కలుగజేయుచు, ఇంద్రియము లన్నింటిని సంతసింపజేయుచు, సామ్రాజ్యములనైన దానమీయగలదై, పాపములను నశింపజేయు ప్రయత్నమందున్న మా నమస్కారములు. ఎల్లప్పుడూ మాకు శుభముల నిచ్చునట్లు అనుగ్రహింపుము.
ఆంగ్లం: LET ME PROSTRATE TO THY FEET
O! WORTHY GODDESS! O! MOTHER SWEET!
THOU GIVETH ALL PROSPERITY
TO DESTROY SINS IS THY PROPERTY
THOU GIVETH PLEASURES TO ALL SENSES
O! KIND MOTHER! GODDESS OF ALL TENSES
KINGDOMS ARE GAINED AT THY GRACE
O! LOTUS-EYED! CRAVE THY GRACE

No comments:
Post a Comment