శ్లోకం: నమోస్తు! దేవ్వై భృగునందనాయై
నమోస్తు! విష్ణోరురసి స్థితాయై
నమోస్తు! లక్ష్మై కమలాలయాయై
నమోస్తు! దామోదర వల్లభాయై
పద్యం: వందనము దేవి! భృగుముని నందన! నీకు
వందనము హరియురము నీ వాసమమ్మ!
వందనము లక్ష్మీ! కమలనివాస! నీకు
వందనము దమోదరు వనిత! నీకు
అర్థం: భృగు మహర్షి పుత్రికయైన దేవికి నమస్కారము. విష్ణుదేవుని వక్షమందు నివసించు దేవికి నమస్కారము. పద్మమందు నివసించు లక్ష్మీదేవికి నమస్కారము. వనమాల ఉదరమునందు గల శ్రీహరి దేవేరికి నమస్కారము.
ఆంగ్లం: DAUGHTER OF THE GREAT SAINT (BHRUGU), SALUTE TO THEE,
SEATED ON THE LORD'S BOSOM, SALUTE TO THEE
O! NATIVE OF THE LOTUS-SEAT, SALUTE TO THEE
THE CONSORT OF OMNIPOTENT, SALUTE TO THEE

No comments:
Post a Comment