Wednesday, May 26, 2021

క‌న‌క‌ధార‌- ఆంగ్ల ధార‌!-3



ప‌ద్యం:  ముగ్ధా ముహుర్వ‌ద‌ధ‌తీ వ‌ద‌నే మురారేః

ప్రేమ‌త్ర పాప్ర‌ణి హితాని గ‌తాగ‌తాని

మాలా దృశోర్మ‌ధుక‌రీవ మ‌హోత్ప‌లేయా

సామే శ్రియం దిశ‌తు సాగ‌ర సంభ‌వాయాః


ప‌ద్యం:  తేటి త‌మ్మిపైబోలె శ్రీదేవి చూపు

హ‌రి వ‌ద‌నమందు ముగ్ధ‌మై మ‌ర‌ల మ‌ర‌ల‌

ప్రేమ నును సిగ్గు దొంత‌ర ప్రేముడించి 

రాక‌పోక‌ల‌లో సిరి నాకు నొస‌గు


అర్థం: ప‌ద్మ‌ముపై ఆడు తుమ్మెద‌వ‌లె మురారి ముఖ‌మునందు మ‌నోహ‌ర‌ముగా ప్రేమ‌తో సిగ్గుతో మాటిమాటికి రాక‌పోక‌లు చేయుచున్న క‌డ‌లి కుమార్తె చూపుల దండ నాకు సంప‌ద‌ను అనుగ్ర‌హించు గాక‌!


ఆంగ్లం: AS A BEE GOES TO A LILLY (BLUE) IN BLOOM

SO THY LOOKS GO TO THE LORD BLUE

AS THE BEE OFTEN GOES ABOUT

SO THY LOOKS IN SHYNESS GO ABOUT

REPEATING VISITS OF LOVE AND PASSION

SUCH REPEATING LOOKS OF THE MAID OF THE OCEAN, 

MAY GRANT ME TREASURES

AND ALL KINDS OF PLEASURES! 

No comments:

Post a Comment