Thursday, May 27, 2021

క‌న‌క‌ధార‌-ఆంగ్ల ధార‌!-6



శ్లోకం:  కాలాంబు రాశి ల‌లితోర‌సికైట‌భారేః

థారాధ‌రే స్ఫుర‌తి యాత‌టిదంగ‌నేవ

మాతు స్స‌మ‌స్త‌ జ‌గ‌తాం మ‌హ‌నీయమూర్తిః

భ‌ద్రాణి మే దిశ‌తు భార్గ‌వనంద‌నాయాః


ప‌ద్యం:  కారు మ‌బ్బుల పోలిన కైట‌భారి

ఉరమునందు మ‌బ్బుల మీద మెర‌పు వోలె

భార్గ‌వి! భువ‌న‌మాత‌! శ్రీ భాగ్య దేవి

దివ్య‌మూర్తి భ‌ద్ర‌ము నాకు దిప్తి నొస‌గు


అర్థం:  కైట‌భాసురుని సంహ‌రించిన శ్రీహ‌రి మ‌బ్బు ఛాయ‌ను పోలు హృద‌యము మీద‌, నీల‌మేఘ‌మున మెర‌యున‌ట్టి మెర‌పు ప‌డుచువ‌లె, స‌మ‌స్త జ‌గ‌ముల‌కు మాత‌యైన, భార్గ‌వ‌ముని పుత్రిక‌య‌గు శ్రీదేవి దివ్య‌మూర్తి నాకు భ‌ద్ర‌ముల‌ను అనుగ్ర‌హించుగాక!


ఆంగ్లం: THE LORD BLUE AS A CLOUD

SHE, AS A LIGHTNING ON THE LORD'S CLOUD

IS A DAMSEL ABOVE ALL WORDS,

SHE IS THE MOTHER OF ALL WORLDS,

MAY THAT GODDESS OF PLEASING BEAUTY

GRANT ME ALL THE WORLDLY BOOTY


 

No comments:

Post a Comment