శ్లోకం: అంగంహరేః పులక భూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళ దేవాతాయాః
పద్యం: పులక తొడవుల హరిమేను కలియజూడ
తేటి చీకటి మొగ్గల సాటిదెలుప
మంగళాదేవి క్రేగన్ను మహిమ
అఖిల సంపత్తితోడ నన్నలరజేయు
అర్థం: శ్రీహరి పులకలు అలంకరించుకొన్న శరీరమును మొగ్గలు అలంకారముగానున్న చీకటి చెట్టును ఆడుతుమ్మెదలవలె ఆశ్రయించి, సమస్త సంపదలను అనుగ్రహించునట్టి శ్రీదేవి కటాక్ష విలాసము నాకు శుభమును ఒసగుగాక!
ఆంగ్లం: AS THE HONEY-BEES SWARM A BOWER
WITH MANY A HONEYED FLOWER
SO THY PLEASING LOOKS GRAZE
ON THE LOTUS-EYED IN BOUNDLESS PLEASURE
MAY SUCH LOOKS OF THY GRACE
GRANT ME BOUNDLESS PLEASURE!

No comments:
Post a Comment