ఆది గురువు శంకరాచార్యులు సంస్కృతంలో ఆశువుగా అనుగ్రహించిన కనకధారా స్తవము శ్లోకాలను ఆంగ్లంలోకి అనువదించాలనేది నాన్నగారి సంకల్పం. ఆ సంకల్పానికి తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీ కనక దుర్గా పబ్లికేషన్స్ వారి సహకారం తోడై పుస్తకరూపం దాల్చింది. అయితే ఆ పుస్తకాన్ని చూసుకోకుండానే ఆయన మరణించడం విధివిలాసం.
ఆ పుస్తకం కోసం ఆయన 5.11.1978 తేదీతో ముందు మాట రాశారు. ఆ పుస్తకం ప్రచురుణ సన్నాహాలలో ఉండగానే ఆయన 23.11.1978 నాడు హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణానంతరం విడుదలైన ఆ పుస్తకంలో ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు.
నాన్నగారి స్నేహితులు, అప్పట్లో మండపేట కాలేజీ ప్రిన్నిపాల్ పన్నాల భట్టశర్మ గారు ఆ పుస్తకంలో కనకధార స్తవం శ్లోకాలకు తెలుగు పద్యాలు రాయగా, అదే కాలేజీలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసిన నాన్నగారు ఇంగ్లిషు పద్యాలు రాశారు. సంస్కృత శ్లోకాలు, తెలుగు అర్థం, తెలుగు పద్యాలు, ఆంగ్ల పద్యాలతో ఆ పుస్తకం ఎంతో అపురూపమైనదిగా రూపుదిద్దుకుంది.
అందులోని పద్యాలను ఆయన పేరుతో నేను ప్రారంభించిన బ్లాగులో పెట్టాలనేది నా తపన. అవలోకించండి.
.........
శ్లోకం: వందే వందారు మందారం
ఇందిరానంద కందళమ్
అమందానంద సందోహ
బంధురం సింధురాననమ్.
పద్యం: వందనములకు కల్పక బృందమొసగి
ఇందిరాదేవి యానంద మింపుజేసి
సంతతానంద సందోహ సంభ్రముడవు
వదన గజదేవ! వందనా వందనములు
అర్థం: వందనము చేయువారికి కల్పవృక్షమును, లక్ష్మీదేవి ఆనందమునకు మూలమును, అపరిమితమైన ఆనందము నొసగునట్టి గజముఖునకు నా నమస్కారము.
ఆంగ్లం:




No comments:
Post a Comment