శ్లోకం: దద్యాద్దయా సుపవనో ద్రవిణాంబుధారాం
ఆస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయదూరం
నారాయణ ప్రణయనీ నయనాంబు వాహః
పద్యం: దీన దరిద్రమౌ పక్షి కూనయిద్ది
దీని పాపపు వేసవి దీర్చి దవ్వు
జేసి నారాయణును విద సిరికను మొయి
లు, దయ వాయువై ధనధారలు కురిపించు
అర్థం: అజ్ఞానియు, దీనమునయిన ఈ పక్షిపిల్ల మీద పాపమనెడు వేసవిని చిరకాలము దూరముగా జేసి, దయ అనెడి వాయువుతో గూడి, నారాయణుని ప్రియురాలగు శ్రీదేవి కన్ను అనెడి మేఘము ధనమనెడి నీటిధారను అనుగ్రహించుగాక!
ఆంగ్లం: MAY THE GODDESS OF WEALTH
SHOWER AS A CLOUD, ALL WEALTH
UNTO ME, A THIRSTY BIRD
OPPRESSED BY SINS AND MISERY UNHEARD,
AS SHOWERS LOOKS OF PASSION
ON THE LORD THAT SLEEPS ON THE OCEAN.

No comments:
Post a Comment